నెల రోజుల విరామం తరువాత భారత ఆటగాళ్లు మరోసారి బిజీ బిజీ క్రికెట్ షెడ్యూల్‌తో గడపనున్నారు. జూలై మొదటివారంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు.. ఆ సిరీస్ ముగిసిన వెంటనే అక్కడనుండి నేరుగా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ మేరకు బీసీసీఐ.. ఐర్లాండ్ సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్ట్ 18న తొలి టీ20 జరగనుండగా, 20న రెండో టీ20, ఆగస్ట్ 23న మూడో టీ20 జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు మలాహిడే వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ ముగిసిన వారానికే ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది.
ఇండియా vs ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్
- ఆగస్ట్ 18: తొలి టీ20 (మలాహిడే)
- ఆగస్ట్ 20: రెండో టీ20 (మలాహిడే)
- ఆగస్ట్ 23: మూడో టీ20 (మలాహిడే)
కాగా, జూలై మొదటి వారంలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ టూర్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి. ఆగస్టు 13తో ఈ సిరీస్ ముగియనుంది.