ఈ ఏడాది భారత జట్టు తీరికలేని క్రికెట్ ఆడనుంది. ఒక సిరీస్ ముగిసేలోపు మరొక సిరీస్ మొదలుకానున్నాయి. ఇది ఒకరకంగా క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పాలి.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు, మరో నెల రోజుల పాటు అక్కడే ఉండనుంది. టెస్ట్ సిరీస్ ముగిశాక.. వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అనంతరం అటు నుంచి నేరుగా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరగనున్నాయి. అటు మీదట ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీల్లో తలపడనున్న టీమిండియా.. ఇది ముగిసిన వెంటనే డిసెంబర్‌లో సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లనుంది.
వన్డే వరల్డ్ 2023 ముగిసిన 15 రోజుల్లోనే భారత జట్టు.. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఇండియా vs సౌతాఫ్రికా టీ20 సిరీస్
- డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్)
- డిసెంబర్ 12: రెండో టీ20(గెబర్హా)
- డిసెంబర్ 14: మూడో టీ20 (జోహన్‌బర్గ్)
ఇండియా vs సౌతాఫ్రికా వన్డే సిరీస్
- డిసెంబర్ 17: మొదటి వన్డే (జోహన్‌బర్గ్)
- డిసెంబర్ 19: రెండో వన్డే (గెబర్హా)
- డిసెంబర్ 21: మూడో వన్డే (పర్ల్)
ఇండియా vs సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్
- డిసెంబర్ 26 - 30: తొలి టెస్టు (సెంచూరియన్)
- జనవరి 3 - 7: రెండో టెస్టు (కేప్‌టౌన్)
BCCI and @ProteasMenCSA announce fixtures for India’s Tour of South Africa 2023-24.
— BCCI (@BCCI) July 14, 2023
For more details - https://t.co/PU1LPAz49I #SAvIND
A look at the fixtures below ?? pic.twitter.com/ubtB4CxXYX