ఐపీఎల్ మ్యాచ్లన్నీ ఆడితే కోటిన్నర.. ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్..

ఐపీఎల్ మ్యాచ్లన్నీ ఆడితే కోటిన్నర.. ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్..

ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ సెక్రటరీ జైషా బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి ఐపీఎల్ ఆటగాళ్లకు ఒక్కో ఐపీఎల్ మ్యాచ్కు గానూ రూ.7.5 లక్షల మ్యా్చ్ ఫీజు చెల్లించనున్నట్లు తన ‘ఎక్స్’ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. అంటే.. ఐపీఎల్లో అన్ని మ్యాచ్లు ఆడిన ఆటగాడికి కాంట్రాక్ట్ అమౌంట్ కాకుండా అదనంగా రూ.1.05 కోట్లు పొందే అవకాశం దక్కుతుంది.

ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీలు మ్యాచ్ ఫీజుగా చెల్లించడం కోసం రూ.12.60 కోట్లు కేటాయించనున్నట్లు జైషా తెలిపారు. ఐపీఎల్ ఆటగాళ్లకు ఇదొక సువర్ణావకాశం అని జైషా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఐపీఎల్ ఆటగాళ్లలో సుస్థిరత సాధించేందుకు, అద్భుతమైన ఆటతీరుతో ఆటగాళ్లు అదరగొట్టేందుకు ఈ మ్యాచ్ ఫీజు చెల్లించాలని డిసైడ్ అయినట్లు జైషా తెలిపారు.

ALSO READ | SL vs NZ 2024: గాలే టెస్ట్.. ఒకే రోజు రెండు సార్లు ఔటైన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్స్

‘క్యాష్ రిచ్ లీగ్’గా ఇప్పటికే పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL).. జైషా చేసిన ఈ ప్రకటనతో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపినట్లయింది. ఐపీఎల్పై ఆటగాళల్లో మరింత ఆసక్తి పెంచేందుకు కొత్తకొత్త స్కీంలతో బీసీసీఐ బంపర్ ఆఫర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ప్రకటించిన ఈ మ్యాచ్ ఫీజు వల్ల.. ఐపీఎల్ సీజన్ మధ్యలోనే వైదొలగిపోతున్న ఆటగాళ్లు పునరాలోచించే అవకాశం ఉంది. 

ఐపీఎల్లో కొనుక్కుంటున్న విదేశీ క్రికెటర్లు తమ దేశం తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు ఐపీఎల్ను వదిలేసి అర్థాంతరంగా వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. స్వదేశీ యువ ఆటగాళ్లకు కూడా తక్కువ ధరకే ఐపీఎల్ సీజన్ ఆడాల్సి వస్తుందనే మనోవేదన కూడా ఈ మ్యాచ్ ఫీజు కారణంగా దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు.. రూ.20 లక్షల బేస్ ప్రైజ్కు ఒక యువ ఆటగాడిని ఫ్రాంచైజీ దక్కించుకుందనుకుందాం. ఆ ప్లేయర్ అన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే కోటి రూపాయలకు పైగా మ్యాచ్ ఫీజు రూపంలో పొందే అవకాశం ఉంది.