
న్యూఢిల్లీ: సొంతగడ్డపై బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌తో టీమిండియా పోటీపడే సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ కొద్దిగా మార్చింది. అక్టోబర్ 6వ తేదీన ఇండియా–బంగ్లా తొలి టీ20 వేదికను ధర్మశాల నుంచి గ్వాలియర్‌కు మార్చినట్టు మంగళవారం ప్రకటించింది. ధర్మశాల స్టేడియంలో రినోవేషన్ పనులు జరగడమే ఇందుకు కారణమని తెలిపింది. అలాగే, వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో మొదటి, రెండో మ్యాచ్‌ల వేదికల్లోనూ మార్పులు చేసింది. చెన్నైలో జనవరి 22న జరగాల్సిన తొలి టీ20.. కోల్‌కతాలో జరుగుతుందని తెలిపింది. కోల్‌కతా ఈడెన్‌లో జనవరి 25న జరగాల్సిన రెండో మ్యాచ్‌ను చెన్నైకి కేటాయించింది.