IPL 2024: బీసీసీఐకి హ్యాట్సాఫ్.. గ్రౌండ్స్‌మెన్‌, పిచ్ క్యూరేటర్‌లకు భారీ నగదు

IPL 2024: బీసీసీఐకి హ్యాట్సాఫ్.. గ్రౌండ్స్‌మెన్‌, పిచ్ క్యూరేటర్‌లకు భారీ నగదు

ఐపీఎల్ సీజన్-17లో గ్రౌండ్స్‌మెన్‌, పిచ్ క్యూరేటర్‌లు ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ జరగడానికి వీరు పడిన కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ ల్లో వీరు శ్రమ తీసి పారేయలేం. వీరి కష్టాన్ని గుర్తించిన బీసీసీఐ భారీ నగదును ప్రకటించింది. 10 సాధారణ ఐపీఎల్ వేదికలలోని గ్రౌండ్స్‌మెన్,  క్యూరేటర్‌లు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు.. 3 అదనపు వేదికలలోని వారికి రూ. 10 లక్షలు రివార్డును అందుకుంటారని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు.

ఐపీఎల్ లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, హైదరాబాద్, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్,  జైపూర్‌లను కలుపుకొని మొత్తం 10 సాధారణ వేదికల గ్రౌండ్స్‌మెన్‌, పిచ్ క్యూరేటర్‌లకు రూ. 25 లక్షలు అందుకోనున్నారు. ఈ సీజన్ లో కొన్ని కారణాల వలన మరో అదనపు వేదికలలో మ్యాచ్ లు జరిగాయి. గౌహతి (రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హోమ్ గ్రౌండ్).. విశాఖపట్నం (ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోమ్ గ్రౌండ్) ధర్మశాల (పంజాబ్ కింగ్స్ ) వేదికలు ఐపీఎల్ సీజన్ 2024 కు ఆతిధ్యమిచ్చాయి. గ్రౌండ్స్‌మెన్‌, పిచ్ క్యూరేటర్‌లకు రూ. 10 లక్షల రివార్డ్ ప్రకటించారు.   

2024 లో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పిచ్ కు బెస్ట్ అవార్డు వరించింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన సెర్మనీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ అవార్డుతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌‌) 17వ సీజన్‌‌లో ఖతర్నాక్ ఆట చూపెట్టిన కోల్‌‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌‌గా నిలిచింది. టోర్నీ స్టార్టింగ్ నుంచి అదరగొట్టిన కేకేఆర్‌‌‌‌ ఆదివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మెగా ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌‌ను ఓడించింది.