మార్చి 22 నుంచి ఐపీఎల్​ .. హైదరాబాద్‌లో తొమ్మిది మ్యాచ్‌లు

మార్చి 22 నుంచి ఐపీఎల్​ .. హైదరాబాద్‌లో తొమ్మిది మ్యాచ్‌లు
  • ఈడెన్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ తొలిపోరు
  • మే 25న కోల్‌‌‌‌‌‌‌‌కతాలోనే ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌
  • మొత్తం13 వేదికల్లో 74 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1, ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌ కూడా‌‌‌‌‌‌‌‌

ముంబై: క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌‌‌‌‌‌‌‌) 18వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న ఈడెన్‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో  డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌, రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ) మధ్య తొలి పోరుతో మెగా లీగ్‌‌‌‌‌‌‌‌కు తెరలేవనుంది. మే 25న ఫైనల్‌‌‌‌‌‌‌‌కు కూడా ఈడెన్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు లీగ్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 

 గత సీజన్ రన్నరప్‌‌‌‌‌‌‌‌ సన్ రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో  రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌తో తన పోరు ఆరంభిస్తుంది. అదే రోజు రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ఐదుసార్లు చాంపియన్స్‌‌‌‌‌‌‌‌  సీఎస్కే, ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ మధ్య మెగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో మొత్తం  74 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు 13 వేదికలలో జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. మధ్యాహ్నం మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. 

ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టు  ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌జీ) తో వైజాగ్‌‌‌‌‌‌‌‌లో తలపడనుంది. డీసీ తమ హోమ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో తొలి రెండింటిని వైజాగ్‌‌‌‌‌‌‌‌లో మిగతా వాటిని ఢిల్లీలో ఆడనుంది.  రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌ రెండు హోమ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను గువాహతిలో, పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌ మూడు హోమ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను ధర్మశాలలో ఆడనున్నాయి. 

ఉప్పల్‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, సీఎస్కే మ్యాచ్‌‌ల్లేవ్‌‌..

ఉప్పల్ స్టేడియం ఈసారి మొత్తం తొమ్మిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. దాంతో భాగ్యనగర క్రికెట్ అభిమానుల ఆనందం రెట్టింపవనుంది. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లతో పాటు ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 (మే20),  ఎలిమినేటర్ (మే21)ను ఉప్పల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించారు. ఈడెన్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో మే 23న క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2తో పాటు ఫైనల్‌‌‌‌‌‌‌‌ (మే 25)తో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ ముగుస్తుంది. అయితే, గ్రూప్‌‌‌‌‌‌‌‌–2లో ఉన్న సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ గ్రూప్‌‌‌‌‌‌‌‌–1లోని  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, రాజస్తాన్‌‌‌‌‌‌‌‌, సీఎస్కే, పంజాబ్‌‌‌‌‌‌‌‌తో ఒక్కో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఆడనుంది. 

ఇందులో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, సీఎస్కేతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో లేకపోవడం అభిమానులకు కొంత నిరాశకలిగించే అంశం.  అయితే, రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు కేటాయించిన నేపథ్యంలో చివరి దశలో అయినా  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, సీఎస్కే జట్ల ఆటను ఉప్పల్ స్టేడియంలో చూసే అవకాశం భాగ్యనగర అభిమానులకు దక్కుతుందేమో చూడాలి.

సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు
తేదీ     ప్రత్యర్థి    వేదిక    సమయం
మార్చి 23    రాజస్తాన్    హైదరాబాద్    మ. 3.30
మార్చి 27    లక్నో    హైదరాబాద్     రా. 7.30
మార్చి 30    ఢిల్లీ     వైజాగ్‌‌‌‌‌‌‌‌    మ. 3.30 
ఏప్రిల్ 03    కేకేఆర్    కోల్‌‌‌‌‌‌‌‌కతా    రా. 7.30
ఏప్రిల్ 06    గుజరాత్     హైదరాబాద్    రా. 7.30
ఏప్రిల్ 12    పంజాబ్    హైదరాబాద్    రా. 7.30
ఏప్రిల్ 17    ముంబై    ముంబై     రా. 7.30
ఏప్రిల్ 23    ముంబై    హైదరాబాద్     రా. 7.30
ఏప్రిల్ 25    సీఎస్కే    చెన్నై    రా. 7.30
మే 02    గుజరాత్    అహ్మదాబాద్     రా. 7.30
మే 05    ఢిల్లీ    హైదరాబాద్    రా. 7.30
మే 10    కేకేఆర్    హైదరాబాద్     రా. 7.30
మే 13    ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ    బెంగళూరు     రా. 7.30
మే 18    లక్నో    లక్నో     రా. 7.30
మే20    క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1    హైదరాబాద్    రా. 7.30
మే 21    ఎలిమినేటర్    హైదరాబాద్    రా. 7.30