Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీకి జట్ల ప్రకటన.. ఆ నలుగురికి విశ్రాంతి

దేశంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ బుధవారం (ఆగస్ట్ 14) జట్లను ప్రకటించింది. రాబోయే ఎడిషన్ కోసం నాలుగు స్క్వాడ్ లను ఎంపిక చేసింది. టీమ్ ఏ,టీం బి, టీమ్ సి, టీం డి జట్లకు వరుసగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్,  శ్రేయాస్ అయ్యర్  కెప్టెన్లుగా జట్టును నడిపిస్తారు. టోర్నీ తొలి రౌండ్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవి చంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాలు ఈ దులీప్ ట్రోఫీ ఆడట్లేదు.  
 
రౌండ్-రాబిన్ టోర్నమెంట్ ఫార్మాట్‌లో ఈ ట్రోఫీ జరుగుతుంది. ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లో మొత్తం ఆరు మ్యాచ్ లు జరుగుతాయి. ఆరు మ్యాచ్ లు ముగిసిన తర్వాత అగ్ర స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. టీమ్ ఇండియా రెగ్యులర్ ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ , యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. రానున్న నాలుగు నెలల వ్యవధిలో భారత్‌లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు.. న్యూజిలాండ్ తో మూడు టెస్టులు.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో భారత్.. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ కు ఎంపిక కావడానికి యువ ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశం.

టీమ్ A: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.

టీమ్ B: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి, ఎన్ జగదీశన్.

టీమ్ C: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ జురీనాల్, మయాంక్ మార్కండే, సందీప్ వారియర్.

టీమ్ D: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ భరత్ గుప్తా, కెఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.