సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టులో చోటు దక్కించుకున్న భారత్ ఎ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్ రెండో రౌండ్‌కు దూరమయ్యారు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ ను యథావిధిగా కొనసాగించడం గమనార్హం.
రింకూకు పిలుపు
శుభ్‌మన్ గిల్ దూరమవ్వడంతో ఇండియా-ఏ కెప్టెన్గామయాంక్ అగర్వాల్ కు బాధ్యతలు అప్పగించారు. రైల్వేస్‌కు చెందిన ప్రథమ్ సింగ్, విదర్భకు చెందిన అక్షయ్ వాడ్కర్, ఆంధ్రాకు చెందిన షేక్ రషీద్ రెండో రౌండ్లో కొత్త ముఖాలు. టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్ సైతం ఈ దేశవాళీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. మార్పులతో కూడిన ఇండియా-ఏ, బి, సి, డి జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
ఇండియా ఏ: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షామ్స్ ములాని, అకిబ్ ఖాన్.
ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్, సుయాస్ ప్రభుదేశాయ్, రింకూ సింగ్, హిమాన్షు.
ఇండియా సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.
ఇండియా డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్, సంజు శాంసన్, నిశాంత్ సిద్ధు, విద్వాత్ కవెరప్ప.