Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత జట్టు ఇదే

వచ్చే నెల ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. వెన్నునొప్పి గాయం కారణంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్ట్ నుంచి వైదొలిగిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అలాగే, వన్డే ప్రపంచ కప్ అనంతరం జట్టుకు దూరమైన మరో భారత పేసర్ మహ్మద్ షమీ జట్టులో చోటు సంపాదించాడు. 

కీపర్‌గా రిషబ్ పంత్..

జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం(జనవరి 18) సమావేశమయ్యింది. ఈ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లు  తెలుస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ ఎవరనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. రిషబ్ పంత్, సంజు శాంసన్, ధ్రువ జురెల్, ఇషాన్ కిషన్ రూపంలో నలుగురు రేసులో ఉండటంతో సెలెక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోయారని వినికిడి. చివరకు రిషబ్ పంత్‌పై నమ్మకముంచి అతనికి జట్టులో చోటు కల్పించారు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డే జట్టులో చోటు సంపాదించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.

ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ఒక్క మార్పు మినహా దాదాపు ఇదే జట్టును కొనసాగించనున్నారు. ఇంగ్లండ్‌తో జ‌రిగే వ‌న్డేల‌కు బుమ్రా ఆడ‌డంలేదు. అతని స్థానంలో హ‌ర్షిత్ రాణాకు చోటు క‌ల్పించారు.

ఇంగ్లండ్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, యశస్వి జస్వాల్ , రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.

టైటిల్ రేసులో ఎనిమిది జట్లు

మొత్తం ఎనిమిది జట్లుతలపడుతున్న  తలపడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్‌తోపాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు  ఆడే మ్యాచ్‌లు దుబాయిలో జరగనుండగా.. మిలిగిన జట్లు తలపడేమ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్

  • ఫిబ్రవరి 19: పాకిస్థాన్ vs న్యూజిలాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)
  • ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా  (నేషనల్ స్టేడియం, కరాచీ)
  • ఫిబ్రవరి 22:  ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • ఫిబ్రవరి 23: పాకిస్తాన్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
  • ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
  • ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • ఫిబ్రవరి 27: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
  • ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • మార్చి 1: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్  (నేషనల్ స్టేడియం, కరాచీ)
  • మార్చి 2: న్యూజిలాండ్ vs భారత్ (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • మార్చి 4: సెమీ-ఫైనల్ 1 (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • మార్చి 5:సెమీ-ఫైనల్ 2 (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • మార్చి 9: ఫైనల్ (గడాఫీ స్టేడియం, లాహోర్)