ఒక్క టెస్ట్‌కు 45 లక్షలు.. టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్

ఒక్క టెస్ట్‌కు 45 లక్షలు.. టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్

టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి చూపించే ఆటగాళ్లకు ఇది ఖచ్చితంగా శుభవార్త అనే చెప్పాలి. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆటగాళ్లను ప్రోత్సహించడానికి, ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడ ప్రదర్శన అందించడానికి భారత క్రికెట్ బోర్డు మార్చి 9న ఒక కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. "టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్" అనే పేరుతో టీమిండియా మెన్స్ జట్టు ఆటగాళ్లకు అదనపు మ్యాచ్ ఫీజులను ప్రకటించింది.

భారత్ తరఫున ఒక సీజన్‌లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడే ఆటగాళ్లు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు రూ. 45 లక్షల మ్యాచ్ ఫీజ్ అందుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. ప్రస్తుతం ఒక్కో టెస్టు క్రికెటర్‌కు రూ.15 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకుండా బెంచ్ మీద ఉన్నవారికి కూడా ఒక్కో మ్యాచ్‌కి అదనంగా రూ. 22.5 లక్షలు అందుకుంటారు. ఈ కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుండి అమలులోకి వస్తుంది. ఈ పథకం కోసం బీసీసీఐ ఒక్కో సీజన్‌కు అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది.

ALSO READ :- రూ.7వేలకే స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన బ్యాటరీ,కెమెరా ఫీచర్లు

"మా గౌరవమైన క్రికెటర్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మెన్స్ సీనియర్ క్రికెటర్ల కోసం 'టెస్ట్ క్రికెట్ ప్రోత్సాహక పథకం' ప్రారంభించడం పట్ల నేను సంతోషిస్తున్నాను. 2022-23 సీజన్ నుండి 'టెస్ట్ క్రికెట్ ప్రోత్సాహక పథకం' ప్రారంభమవుతుంది. టెస్ట్ మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం ఉన్న మ్యాచ్ ఫీజుపై అదనపు రివార్డ్ స్ట్రక్చర్‌గా పనిచేస్తుంది. అని BCCI సెక్రటరీ జేషా సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు. ఇటీవలే టీమిండియా కీలక ప్లేయర్లు ఇషాన్ కిషాన్, శ్రేయాస్ అయ్యర్ టెస్టులపై ఆసక్తి చూపించని సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకొని ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.