వరల్డ్ కప్ లో భాగంగా కాసేపట్లో భారత్-శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ కు అభిమానులకు బీసీసీఐ సెక్రటరీ జైషా ఒక కఠిన రూల్ ను తీసుకొచ్చాడు. మ్యాచ్ జరిగే సమయంలో, ముగిసిన తర్వాత ఎలాంటి బాణాసంచాను కాల్చకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది. ముంబైలోని విపరీతమైన గాలి కాలుష్యమే దీనికి కారణం.
ఇటీవలే బాంబే హై కోర్ట్ ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగే సమయంలో ఢిల్లీ, ముంబై నగరాల్లో ఎలాంటి బాణాసంచాతో ఎలాంటి క్రాకర్స్ కాల్చకూడదని తెలియజేసింది. దీంతో సెలెబ్రేట్ చేసుకోవడానికి నేటి మ్యాచ్ లో ఎలాంటి క్రాకర్స్ ఉండకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జైషా మాట్లాడుతూ "నేను ఈ విషయాన్ని ఐసీసీతో అధికారికంగా మాట్లాడాను. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీలో ఎటువంటి బాణసంచా ప్రదర్శనలు ఉండవు. ఇవి కాలుష్య స్థాయిని పెంచుతాయి. పర్యావరణ సమస్యలపై పోరాడేందుకు బీసీసీఐ ఎప్పుడూ ముందు ఉంటుంది". అని తెలిపాడు.
Also Read : ODI World Cup 2023: సచిన్ 16 ఏళ్ళ రికార్డ్‌పై కోహ్లీ గురి.. బ్రేక్ చేస్తే తొలి ప్లేయర్‌గా ఆల్‌టైం రికార్డ్
కాలుష్యం విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేసాడు. ముంబై సిటీలో గాలి కాలుష్యం అధికంగా ఉంటుంది. మన భవిష్యత్ తరాలు ఎలాంటి భయం లేకుండా జీవించాలంటే కాలుష్యాన్ని నిర్మూలించడం చాలా ముఖ్యం అని తెలియజేశాడు. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. మరో వైపు శ్రీలంక ఓడితే ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరి వాంఖడేలో ఎవరు ఆధిపత్యం చూపిస్తారో చూడాలి.