ఈ యాడ్స్ మేం వేయం, తీసుకోం : ఒట్టేసుకున్న బీసీసీఐ

ఈ యాడ్స్ మేం వేయం, తీసుకోం : ఒట్టేసుకున్న బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), దేశ క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం కొత్త స్పాన్సర్‌లను కోరుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. 35 డాలర్ మిలియన్ల ఒప్పందంతో  ed-టెక్ కంపెనీ BYJU's ఒప్పందాన్ని ముగించుకుంది, బ్రాండింగ్ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయమని తెలిపింది. తాజాగా టూల్ కిట్ స్పాన్సర్‌గా ఆదిదాస్ కంపెనీతో బీసీసీఐ కొత్త డీల్ చేసుకుంది. ఐదేళ్ల పాటు ఈ డీల్ కొనసాగనుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్‌గా కూడా ఎక్కువ కాలం ఉండే కంపెనీలతోనే డీల్ చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికోసమే తాజాగా టెండర్లు విడుల చేసింది.

ఈ బిడ్ వేయడంలో కొన్ని కంపెనీలను బ్యాన్ చేస్తున్నట్లు కూడా బీసీసీఐ తెలిపింది. ఈ నిరోధిత బ్రాండ్ వర్గాలలో క్రీడాకారులు, క్రీడా దుస్తుల తయారీదారులు ఉన్నారు. స్పోర్ట్స్‌వేర్ మానుఫ్యాక్చర్లు, ఆల్కహాల్ ఉత్పత్తులు, బెట్టింగ్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ సంస్థలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ మినహా రియల్ మనీ గేమింగ్ వేదికలు, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లు, పోర్నోగ్రఫీ వంటి అఫెన్సివ్ కంటెంట్‌కు సంబంధించిన కంపెనీలు తదితరాలు ఈ స్పాన్సర్‌షిప్‌కు అనర్హులని బీసీసీఐ స్పష్టం చేసింది.
 
'స్పాన్సర్‌షిప్‌పై ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఐటీటీ (టెండర్) కొనుగోలు చేసి బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్‌లో అర్హతలన్నీ కలిగిన కంపెనీలు, మిగతా నిబంధనలను పాటించే కంపెనీలకే ఈ బిడ్‌లో పాల్గొనే అర్హత ఉంటుంది. కేవలం ఐటీటీ కొనుగోలు చేస్తే.. బిడ్ వేస్తారని, వేసేందుకు అర్హత సాధిస్తారని అనుకుంటే పొరపాటే' అని బీసీసీఐ తెలిపింది.