ఛాంపియన్స్ లీగ్ టీ20.. సరిగ్గా పదేళ్ల క్రితం ఈ మెగా టోర్నీ చివరి సారిగా జరిగింది. క్రికెట్ ఆదరణ ఉన్న దేశాలు తమ దేశంలో ఒక డొమెస్టిక్ లీగ్ నిర్వహించుకుంటారు. ఆయా దేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు చాంపియన్స్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. 2009 నుంచి 2014 వరకు మొత్తం ఆరు సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. వీటిలో రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్, రెండు సార్లు ముంబై ఇండియన్స్ విజేతలుగా నిలిచాయి. ఆస్ట్రేలియా జట్లు న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్లు ఒక్కోసారి విజేతగా నిలిచాయి. అయితే అభిమానుల నుండి పెద్దగా ఆదరణ రాకపోవడంతో ఈ మెగా టోర్నీని నిలిపివేశారు.
ఇదిలా ఉంటే ఈ టోర్నీ మరోసారి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య సంభాషణలు జరుగుతున్నాయని క్రికెట్ విక్టోరియా సీఈవో నిక్ కమిన్స్ ధృవీకరించారు. "ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఛాంపియన్స్ లీగ్‌ని మళ్ళీ నిర్వహించడం సవాలుతో కూడుకున్నది. అప్పట్లో టీ20 క్రికెట్ కు పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో టీ20 క్రికెట్ చాలా క్రేజ్ ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా,ఈసీబీ.. బీసీసీఐ తో చర్చలు జరుపుతున్నట్టు నాకు తెలుసు". అని కమ్మిన్స్ అన్నారు.
ALSO READ | IPL 2024: ఇదేదో బాగుందే.. రూల్స్ అతిక్రమించిన ఇషాన్ కిషన్‌కు వెరైటీ శిక్ష
చివరిసారిగా ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్ ఐపీఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. బెంగళూరులో జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ లీగ్‌లో ఇండియా నుండి మూడు జట్లు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుండి రెండు జట్లు, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుండి ఒక జట్టు ఈ లీగ్ లో పాల్గొన్నాయి.
According to reports the Champions League Twenty-20 is set to return.
— Sujeet Suman (@sujeetsuman1991) April 2, 2024
Nick Cummins, CEO, Cricket Victoria " BCCI, ECB and CA are keen on reviving the Champions League Twenty-20 " pic.twitter.com/9pXTQmhAHY