భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ‘బైజూస్’ సంస్థ 158 కోట్ల రూపాయల బాకీ ఉందని నిన్న (డిసెంబర్ 4) పేర్కొంది. దీనికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ‘బైజూస్’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. భారత క్రికెట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ NCLT ఈ నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి బైజూస్‌కు రెండు వారాల గడువు ఇచ్చినట్లు NCLT తెలియజేసింది.
బైజూస్ 2019లో భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా వచ్చి తర్వాత దివాళా తీయడంతో బీసీసీఐకి రూ. 158 కోట్లు బాకీ పడింది. వారం రోజుల్లో బీసీసీఐ తమ అభ్యంతరాలను దాఖలు చేయాలని.. ఆదేశించిన ఎన్‌సీఎల్‌టీ... ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది. బైజూస్ గతంలో BCCI, ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్), FIFA (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్)తో మూడు ముఖ్యమైన బ్రాండింగ్ భాగస్వామ్యాలను కలిగి ఉంది.
??#BYJUS #BCCI #IndianCricketTeam #India #CricketTwitter pic.twitter.com/B2wyUz7asF
— InsideSport (@InsideSportIND) December 4, 2023