టెస్టు క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్

 టెస్టు క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్

టీమిండియా ఆటగాళ్లకు త్వరలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. టెస్టు క్రికెటర్లకు జీతాలు  పెంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.  టెస్ట్  మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ రూ.6 లక్షల చొప్పున జీతాలు ఇస్తుండగా.. ఇప్పుడు దానిని రూ. 15 లక్షలు చేసే ఆలోచనలో ఉంది. ఐపీఎల్ 2024 తరువాత జరిగే టెస్టు సిరీస్ ల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని  సమాచారం. ప్రతి టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటే ఆటగాళ్లకు బోనస్ ఇవ్వాలని కూడా బీసీసీఐ పరిశీలిస్తోంది.  

ఇక  ఆటగాళ్లకు ఒక్కో వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు మ్యాచ్ ఫీజుగా ఉంది. మ్యాచ్ ఫీజుతో పాటు, ఆటగాళ్లు బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్న గ్రేడ్ ప్రకారం వార్షిక జీతం కూడా పొందుతారు. ఇదిలా ఉండగా..  రాంచీలో జరిగిన నాల్గొవ టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ధర్మశాలలో ఐదవ టెస్ట్‌ జరగనుంది.