
2024-25 సీజన్కు గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది. కాంట్రాక్ట్ జాబితాలో మొత్తం 34 మంది ఆటగాళ్లను నాలుగు వేర్వేరు గ్రేడ్‌లుగా విభజించారు. ఈ సారి సెంట్రల్ కాంట్రాక్ట్ లో మొదటి సారి ఐదుగురు ఆటగాళ్లకు చోటు కల్పించిన బీసీసీఐ.. మరో ఐదుగురు క్రికెటర్లను ఈ లిస్ట్ నుంచి తొలగించింది. రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. గ్రేడ్ A+ కేటగిరిని నిలుపుకోగా..రిషబ్ పంత్ గ్రేడ్ బి నుంచి గ్రేడ్ ఏ కు ప్రమోట్ అయ్యాడు. గత ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, కిషాన్ లకు సెంట్రల్ కాంట్రాక్ట్ లో బీసీసీఐ చోటు కల్పించింది.
సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిన ఐదుగురు ఆటగాళ్లు వీరే:
1) అవేష్ ఖాన్: టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టీమిండియా తరపున అవకాశం వచ్చిన ప్రతిసారి పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లోనూ ఆవేశ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడి పేరును తొలగించడం దురదృష్టకరం. చివరిసారిగా 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో టీమిండియా తరపున ఆడాడు. 2022లో అరంగేట్రం చేసిన ఆవేష్ ఖాన్.. ఇప్పటివరకు 8 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లాడాడు.
2) శార్దుల్ ఠాకూర్: శార్దూల్ ఠాకూర్ డిసెంబర్ 2023లో టీమిండియా తరపున చివరిసారిగా ఆడాడు.గాయం కారణంగా 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీ ఆడిన శార్దూల్ తనకు తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లోనూ అద్భుతంగా రానిస్తున్నాడు. 2024 లో భారత్ తరపున ఒక్క మ్యాచ్ ఆడకపోవడం కారణంగానే ఈ ఆల్ రౌండర్ కు కాంట్రాక్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయాడు.
Also Read:-ఆ రెండు జట్లకు చావో రేవో.. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే
3) రవిచంద్రన్ అశ్విన్: డిసెంబర్ 2024లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ తర్వాత భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ లో భాగం కాలేడు. ఈ కారణంగానే అశ్విన్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడ్డాడు.
4) జితేష్ శర్మ: జితేష్ శర్మ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడటం ఊహించిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ జనవరి 2024 నుంచి టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పేలవ ఫామ్ తో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఇండియా తరపున జితేష్ ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్ లాడాడు.
5) కె.ఎస్. భారత్: టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్న కె యస్ భరత్.. ఎన్ని అవకాశాలొచ్చినా ఒక్కసారి కూడా రాణించలేకపోయాడు. దీంతో భారత జట్టులో స్థానం కోల్పోవడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతనికి ఉద్వాసన పలికారు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్లుగా అందుబాటులో ఉండడంతో భరత్‌ను కాంట్రాక్ట్ జాబితా నుండి పూర్తిగా తొలగించారు.