న్యూఢిల్లీ: పదహారేళ్ల కిందట మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బీసీసీఐకి బంగారు బాతులా మారింది. మెగా లీగ్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండటంతో అటు ఆటగాళ్లతో పాటు ఇటు బోర్డుపై కోట్ల వర్షం కురుస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా బీసీసీఐకి దాదాపు రూ. 2,400 కోట్ల (292 మిలియన్ డాలర్లు) ఆదాయం సమకూరింది. ఈ విషయం బోర్డు సమర్పించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. 2021-–22 వరకు బీసీసీఐ వెబ్‌సైట్‌లో ఉన్న ఐదేళ్ల వార్షిక నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్ నాటికి బోర్డు వద్ద 32 వేల కోట్ల మిగులు ఆదాయం ఉంది. అదే ఏడాది జరిగిన ఐపీఎల్‌తో 292 మిలియన్ల డాలర్ల నికర ఆదాయం అభించింది. టోర్నీ మొత్తం రెవెన్యూ 771 మిలియన్లు కాగా అందులో 479 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్టు తేలింది.