
ఐపీఎల్ 2025 సీజన్ కు కు ముందు సూపర్ ఓవర్ లో కొత్త రూల్ ను చేర్చారు. 2019 వరకు, ఒక మ్యాచ్ టైగా ముగిస్తే, ఒక సూపర్ ఓవర్ మాత్రమే ఆడేవారు. అది కూడా టైగా మారితే, మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు (ఫోర్లు, సిక్సర్లు) బాదిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. అయితే, అప్పటి నుండి నియమాలు మారాయి, విజేతను నిర్ణయించే వరకు బహుళ సూపర్ ఓవర్లను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం జరగబోయే ఐపీఎల్ లో మాత్రం గంట వరకు సూపర్ ఓవర్ ఆడాలనే రూల్ ను తీసుకొచ్చారు. దీని ప్రకారం మ్యాచ్ టై గా ముగిసిన తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అవుతూ ఉంటే.. గంట వరకు సూపర్ ఓవర్ ను పొడిగించనున్నారు.
కొన్ని సందర్భాల్లో సూపర్ ఓవర్ కూడా వరుసగా రెండు సార్లు టై అయ్యే అవకాశం ఉంది. ఇలా జరిగినా కూడా మ్యాచ్ ఫలితాన్ని రాబట్టేందుకు బీసీసీఐ గంట సమయాన్ని పొడిగించింది. గంటలోపు అంటే దాదాపుగా నాలుగు సూపర్ ఓవర్ లు జరిగే అవకాశం ఉంది. నాలుగు సూపర్ ఓవర్ లు టై అయ్యే అవకాశాలు దాదాపుగా ఉండవు. ఒకవేళ గంటలోపు సూపర్ ఓవర్ ఆడుతూ మ్యాచ్ టై అయితే అంపైర్లు మ్యాచ్ ను డ్రా గా ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.
ప్రధాన మ్యాచ్ ముగిసిన గంట తర్వాత విజేతను నిర్ణయించే వరకు ఎన్ని సూపర్ ఓవర్లు ఆడవచ్చు. ప్రధాన మ్యాచ్ ముగిసిన 10 నిమిషాల్లోపు మొదటి సూపర్ ఓవర్ ప్రారంభం కావాలి. మొదటి సూపర్ ఓవర్ టై అయితే, తదుపరి సూపర్ ఓవర్ అది పూర్తయిన ఐదు నిమిషాల తర్వాత ప్రారంభం కావాలి. ఐపీఎల్ శనివారం (మార్చి 22) ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడబోతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండు జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి.
🚨 SUPER OVER RULES IN IPL. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2025
- A maximum of one hour will be provided for Super Overs.
- Any number of Super Overs can be played, but within the 1 hour time frame. (Cricbuzz). pic.twitter.com/PiASMBJ8t4
ఇంగ్లాండ్ తొండాటతో మారిన రూల్స్
2019 వన్డే ప్రపంచకప్ ముందు వరకు ఒకసారి మాత్రమే సూపర్ ఓవర్ నిర్వహించి.. విజేతను నిర్ణయించేవారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే ఎక్కువ బౌండరీలు చేసిన జట్టును విజేతగా తేల్చేవారు. అంతకూ ఇరు జట్ల బౌండరీలు సమానమైతే.. సూపర్ ఓవర్‌లో చివరి బంతికి ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటించేవారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ జట్టు బౌండరీ కౌంట్ రూల్‌తో న్యూజిలాండ్‌పై విజయం సాధించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రూల్‌పై సమీక్ష జరిపిన ఐసీసీ కీలక మార్పులు చేసింది.