గ్రేడ్-ఎలో ముగ్గురికి చోటు.. భారత మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలు ఇవే!

గ్రేడ్-ఎలో ముగ్గురికి చోటు.. భారత మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలు ఇవే!

భారత మహిళల క్రికెట్ జట్టుకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. సోమవారం(మార్చి 24) ప్రకటించిన ఈ జాబితాలో  మొత్తం 16 మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టులు పొందారు. 2024-25 సంవత్సరానికిగానూ ఈ కాంట్రాక్ట్ లు వారికి అందుతాయి. భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ , వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మలకు గ్రేడ్-ఎలో తమ స్థానాలను నిలబెట్టుకోగలిగారు.

పేసర్ రేణుకా ఠాకూర్, ఆల్ రౌండర్ జెమిమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ గ్రేడ్ బిలో తమ స్థానాలను దక్కించుకున్నారు. యాస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టీటా సాధు, అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్‌లు గ్రేడ్-సిలో చోటు దక్కించుకున్నారు. శ్రేయాంక పాటిల్, టీటా సాధు, అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, ఉమా ఛెత్రిలు కొత్త‌గా కాంట్రాక్టు ద‌క్కించుకున్నారు.

ALSO READ | DC vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. నలుగురు ఫారెన్ బ్యాటర్లతో లక్నో

ఈ ఏడాది మేఘనా సింగ్, దేవికా వైద్య, షబ్బినేని మేఘన, అంజలి సర్వాణి, హర్లీన్ డియోల్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పొందలేకపోయారు. గ్రేడ్ ఏ లోని క్రీడాకారులకు రూ. 50 లక్షలు అందుతాయి. గ్రేడ్ బి, గ్రేడ్ సి ఆటగాళ్లకు వరుసగా రూ.30 లక్షలు,రూ. 10 లక్షలు లభిస్తాయి. ఈ ఏడాది భారత మహిళా జట్టు స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ ఆడనుంది. 

గ్రేడ్‌ల వారీగా ఆటగాళ్ల జాబితా:

గ్రేడ్ ఏ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ

గ్రేడ్ బి: ​​రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ

గ్రేడ్ సి: యాస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, ఉమా చెత్రీ, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్