ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో బీసీసీఐ ఒకటి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. బీసీసీఐ భారీ లాభాలకు ఐపీఎల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ క్రికెటర్లందరూ కలిసి ఆడే ఈ రిచ్ లీగ్ లో ఆటగాళ్ల నుంచి బీసీసీఐ వరకు కాసుల వర్షం కురుస్తుంది. తాజా నివేదికల ప్రకారం ఐపీఎల్ ద్వారా బీసీసీఐ భారీగా లాభాలు ఆర్జించింది. ఐపీఎల్ 2023 లో రూ. 5120 కోట్లు ఆర్జించిందని సమాచారం.
ఐపీఎల్ 2022 ద్వారా బీసీసీఐ రూ. 2367 కోట్ల మిగిల్చింది. 2023 పోలిస్తే 116 శాతం ఎక్కువగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తం ఆదాయ వృద్ధికి కారణం కొత్త మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు కాణమని తెలుస్తుంది. ఐపీఎల్ టెలివిజన్ హక్కులను 2023 నుంచి 2027 వరకు డిస్నీ స్టార్ 2021లో రూ. 23,575 కోట్లకు దక్కించుకుంది. జియో సినిమా డిజిటల్ రైట్స్ 23,758 కోట్లు.. ఐపీఎల్ టైటిల్ హక్కులను టాటా సన్స్ రూ.2500 కోట్లకు విక్రయించారు.