బీసీసీఐ.. విమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్)లో జట్లను సొంతం చేసుకొని, ఆపరేట్ చేసేందుకు బిడ్ లను ఆహ్వానించింది. విమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ మార్చి4 నుంచి 26 వరకు జరిగే అవకాశం ఉంది. ఆరంభ సీజన్ లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు రూ. 5లక్షలు (నాన్ రిఫండబుల్) చెల్లించాలని కోరింది.
దరకాస్తులో ఐటీటీలో నిర్దేశించిన అర్హత ప్రమాణాలు ఉన్నవారిని మాత్రమే జట్ల కోసం వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే, బిడ్ లో పాల్గొనేవాళ్లు ఈనెల 21లోపు దరకాస్తు పెట్టుకోవాలని సూచింది. ఐపీఎల్ వల్ల మెన్ క్రికెట్ ఆటతీరు దెబ్బతిన్నదని, ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న విమెన్ క్రికెటర్ల ఆటను డబ్ల్యూ ఐపీఎల్ తో దెబ్బకొట్టొద్దని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.