Team India: వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో సిరీస్.. 2025 టీమిండియా హోమ్ షెడ్యూల్, టైమింగ్ వివరాలు!

Team India: వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో సిరీస్.. 2025 టీమిండియా హోమ్ షెడ్యూల్, టైమింగ్ వివరాలు!

టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ తర్వాత 2025లో భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై ఆడబోయే క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది. బీసీసీఐ బుధవారం (ఏప్రిల్ 2) 2025-26 సీజన్ లో టీమిండియా స్వదేశంలో ఆడబోయే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతో టీమిండియా స్వదేశంలో సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో ఇండియా హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది.

వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 

విండీస్ తర్వాత నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్  న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది. 

Also Read : వరల్డ్ బాక్సింగ్ కప్.. సెమీస్‌‌‌‌లో ఇండియా బాక్సర్ జాదుమణి

తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9 న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17 న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. వన్డే మ్యాచ్ లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు.. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. 

ఇండియా వర్సెస్ వెస్టిండీస్

1వ టెస్ట్ - 2వ అక్టోబర్ - 6వ అక్టోబర్, అహ్మదాబాద్

2వ టెస్ట్ - 10 అక్టోబర్ - 14 అక్టోబర్, కోల్‌కతా

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా

1వ టెస్ట్ - 14వ నవంబర్ - 18వ నవంబర్, న్యూఢిల్లీ

2వ టెస్ట్ - 22 నవంబర్ - 26 నవంబర్, గౌహతి

మొదటి వన్డే - నవంబర్ 30, రాంచీ

2వ వన్డే - 3 డిసెంబర్, రాయ్‌పూర్

3వ వన్డే - డిసెంబర్ 6, వైజాగ్

1వ టీ20 - 9 డిసెంబర్, కటక్

2వ టీ20 - 11 డిసెంబర్, న్యూ చండీగఢ్

3వ టీ20 - డిసెంబర్ 14, ధర్మశాల

4వ టీ20 - 17 డిసెంబర్, లక్నో

5వ టీ20 - 19 డిసెంబర్, అహ్మదాబాద్