Impact Player rule: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తొలగించిన బీసీసీఐ.. ఐపీఎల్ సంగతేంటి..?

Impact Player rule: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తొలగించిన బీసీసీఐ.. ఐపీఎల్ సంగతేంటి..?

టీ20 క్రికెట్‌ను మరింత రసవత్తరంగా మార్చే ఉద్దేశ్యంతో బీసీసీఐ.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన కారణంగా.. ఐపీఎల్ జట్లు ఓ అదనపు ఆటగాడితో బరిలోకి దిగుతున్నాయి. బ్యాటర్/ బౌలర్ ఎవరి సేవలు అవసరమైతే వారిని ఉపయోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ఒక జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తే.. తుది జట్టులోబ్యాటర్‌ను తీసుకొని, సెకండ్ ఇన్నింగ్స్‌ సమయంలో అతని స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌ను దించుతోంది. ఈ నిబంధన వల్ల ప్రత్యర్థి జట్టు అంతే లాభ పడుతోంది. 

బీసీసీఐ తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశవాళీ టీ20 క్రికెట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని రద్దు చేసింది. రానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు. ఇప్పటికే బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర అసోసియేషన్లకు తెలియజేసింది. రెండేళ్ల క్రితం దేశవాళీ క్రికెట్ లో బీసీసీఐ ప్రవేశపెట్టబడిన ఈ రూల్ ను తొలగించారు. 

ALSO READ | IND vs NZ 2024: మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. తడిసి ముద్దయిన బెంగుళూరు

ఇంపాక్ట్ ప్లేయర్ నియమంపై ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ లో ఈ రూల్ లేకపోయినా ఐపీఎల్ 2025 లో కొనసాగుతుంది. ఐపీఎల్ 2024 లో తొలిసారి ఈ రూల్ ను ప్రయోగించారు. బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన ఈ టోర్నీలో టీ20 రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఓవర్‌కు రెండు బౌన్సర్ల నిబంధనను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది.