ఐర్లాండ్‌తో స్వదేశంలో జనవరి 10న ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు భారత మహిళా జట్టును సోమవారం (జనవరి 6) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌లకు విశ్రాంతినిచ్చారు. హర్మన్‌ప్రీత్ గైర్హాజరీలో, స్మృతి మంధాన జట్టుకు నాయకత్వం వహిస్తుంది. దీప్తి శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. మూడు వన్డేలు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే ఫార్మాట్ లో అద్భుతంగా రాణించిన మంధాన తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుంది. లేడీ పవర్ హిట్టర్ షెఫాలీ వర్మకు సెలక్టర్లు మరోసారి మోడిచెయ్యి చూపించారు. జనవరి 10న వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా, రెండో మ్యాచ్ జనవరి 12న, సిరీస్ జనవరి 15న ముగుస్తుంది.1993 నుంచి భారత్, ఐర్లాండ్ జట్లు 13 వన్డేలు ఆడాయి. భారత్ 12 గెలిచింది 2002లో ఒక మ్యాచ్ ఓడిపోయింది.
ALSO READ | ZIM vs AFG: రషీద్ ఖాన్‌కు 11 వికెట్లు.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
ఐర్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు:
స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే
Team India W squad for IDFC First Bank ODI series against Ireland W announced pic.twitter.com/nYiQyYJ9cG
— SportsTiger (@The_SportsTiger) January 6, 2025