IND vs ENG: ఇంగ్లాండ్ టూర్‌కు 35 మంది షార్ట్ లిస్ట్: శ్రేయాస్, అక్షర్‌లకు షాక్.. RCB కెప్టెన్‌కు ఛాన్స్

IND vs ENG: ఇంగ్లాండ్ టూర్‌కు 35 మంది షార్ట్ లిస్ట్: శ్రేయాస్, అక్షర్‌లకు షాక్.. RCB కెప్టెన్‌కు ఛాన్స్

ఇంగ్లాండ్ తో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. మరో నెల రోజుల్లో ఐపీఎల్ ముగుస్తుంది. ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో భారత జట్టు ఇంగ్లాండ్ కు పయనమవనుంది. 

జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ కు భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.

తొలి టెస్ట్ మే 30 నుండి కాంటర్‌బరీలోని స్పిట్‌ఫైర్ గ్రౌండ్‌లో జరుగుతుంది. రెండో టెస్ట్ జూన్ 6 నుండి నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఈ రెండు టెస్టుల్లో ఆటగాళ్ల ప్రదర్శన బట్టి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే అంతకంటే ముందు భారత ఏ జట్టులో కుర్రాళ్ళు స్థానం సంపాదించాలి. భారత ఏ జట్టులో కరుణ్ నాయర్ ను సెలక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఈ పర్యటన కోసం ఇండియా ఏ జట్టుతో పాటు భారత సీనియర్ జట్టును బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఇందులో భాగంగా మొత్తం 35 ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్‌ చేయబడినట్టు సమాచారం. కెప్టెన్సీపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు సారధిగా కొనసాగనున్నాడు. మే రెండవ వారం నాటికి సెలెక్టర్లు జట్లను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది. 

►ALSO READ | జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌‌‌‌లో షాద్‌‌మన్‌‌‌‌ సెంచరీ

మిడిల్ ఆర్డర్ అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో ఈ విభాగంలో శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ను పక్కన పెట్టి కరుణ్ నాయర్, రజత్ పటిదార్ ల వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఐదు, ఆరు స్థానాల్లో జట్టుకు వీరు బాగా సరిపోతారని సెలక్టర్లు భావిస్తున్నారట.  బ్యాకప్ ఓపెనర్ గా సాయి సుదర్శన్ ఎంపిక కావడం ఖాయంగా మారింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా చోటు దక్కనుంది.   

హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ గౌల్డ్ ఆశిస్తున్నాడు. 

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్