![టీ20 వరల్డ్ కప్ విన్నర్లకు స్పెషల్ డైమండ్ రింగ్స్](https://static.v6velugu.com/uploads/2025/02/bcci-honors-t20-world-cup-winners-with-custom-made-diamond-rings_EJgPVszTyv.jpg)
ముంబై: టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన ఇండియా టీమ్ క్రికెటర్లకు బీసీసీఐ చిరకాలంగుర్తుండిపోయే కానుక ఇచ్చింది. అమెరికా స్పోర్ట్స్ లీగ్స్ ఎన్‌బీఏ, ఎన్‌ఎఫ్‌ఎల్ తరహాలో ప్రత్యేకంగా తయారు చేయించిన డైమండ్ రింగ్స్‌ను అందజేసింది.
వజ్రాలు పొదిగిన ప్రతీ ఉంగరం మధ్యలో అశోక చక్రం, దాని చుట్టూ 2024 టీ20 వరల్డ్ చాంపియన్స్ ఇండియా, ఓ పక్క ప్లేయర్ పేరు, ఇంకోవైపు జెర్సీ నంబర్ ముద్రించింది. ఈ నెల 1న ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలోనే వీటిని రోహిత్, హార్దిక్, బుమ్రా సహా విన్నింగ్ టీమ్ మెంబర్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.