నోట్బుక్ సెలెబ్రేషన్స్కు చెక్బుక్లో కోత.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్కు భారీ ఫైన్.. కెప్టెన్ పంత్కు కూడా..

నోట్బుక్ సెలెబ్రేషన్స్కు చెక్బుక్లో కోత.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్కు భారీ ఫైన్.. కెప్టెన్ పంత్కు కూడా..

ఐపీఎల్ అంటే అత్యంత టెన్స్ ఉండే గేమ్. మినట్ టు మినట్ ఉత్కంఠగా సాగే ఆట. ఇందులో సిక్స్ బాదినా, వికెట్ తీసినా సెలెబ్రేషనే. అయితే తీవ్రంగా విరుచుకుపడుతున్న బ్యాటర్లను అవుట్ చేసినప్పుడు బౌలర్లు కొన్ని సార్లు వేలం వెర్రి ప్రదర్శిస్తుంటారు. అలా చేయొద్దని హెచ్చరించినా.. కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. 

లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ కూడా అంతే. ఒకసారి ఫైన్ విధించినా.. వికెట్ తీసిన ఆనందంలో మళ్లీ అదే తప్పు చేశాడు. శుక్రవారం (ఏప్రిల్ 4) ముంబైతో మ్యాచ్ లో లక్నో 12 రన్స్ తేడాతో గెలిచిన  విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటర్ నమన్ ధీర్ ను ఔట్ చేయడంతో తన సిగ్నేచర్ సెలెబ్రేషన్స్ ‘నోట్ బుక్’ లో రాస్తున్నట్లుగా మళ్లీ చేశాడు. దీంతో మ్యా్చ్ లో దిగ్వేశ్ రథీకి 50 శాతం విధించింది బీసీసీఐ.

Also Read :- ట్రై సీరీస్లో పాక్ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్

దిగ్వేశ్ కు ఫైన్ విధించడం ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం పంజాబ్ మ్యాచ్ లో కూడా 25 శాతం కోత విధించింది బీసీసీఐ. పంజాబ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య అవుట్ అవ్వడంతో.. నోట్ బుక్ లో రాస్తున్నట్లు చూపించాడు. మళ్లీ చేసిన తప్పే చేయడంతో మరోసారి కోత పడింది ఈ స్పిన్నర్ కు. 

పంత్ కు రూ.12 లక్షల ఫైన్:

లక్నో కెప్టెన్ పంత్ కు కూడా ఈ మ్యాచ్ లో 12 లక్షల రూపాయల ఫైన్ విధించింది బీసీసీఐ. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజ్ లో కోత పడింది.  ఐపీఎల్16వ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. ఆర్టికల్ 2.22 ప్రకారం కోత విధించింది.