IPL 2024: రేపటి నుంచే ఐపీఎల్ సంగ్రామం.. కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన బీసీసీఐ

IPL 2024: రేపటి నుంచే ఐపీఎల్ సంగ్రామం.. కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన బీసీసీఐ

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఐపీఎల్ రేపటి (మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడడంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టు చెన్నై చేరుకుంది. మరోవైపు సొంతగడ్డపై చెన్నై చెలరేగడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. కొత్త సీజన్ లో బీసీసీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.

 
1) ఓవర్ కు రెండు బౌన్సర్లు

బీసీసీఐ బ్యాట్, బంతి మధ్య పోరు రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేసేందుకు.. ఒక ఓవ‌ర్లో ఫాస్ట్ బౌల‌ర్ల‌కు రెండు బౌన్స‌ర్లు సంధించేందుకు అనుమతించారు. ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు క్రికెట్ లో ఒక ఓవర్లో ఒక్క బౌన్సర్ మాత్రమే వేసే రూల్ ఉంది. ఈ ఏడాది జ‌రిగిన స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్ర‌తి ఓవ‌ర్‌లో రెండు బౌన్స‌ర్ల‌కు చాన్స్ ఇచ్చారు. ఈ ప్రయోగాత్మక రూల్ విజయవంతం కావడంతో ఐపీఎల్ 2024కు ఈ రూల్ కొనసాగనుందని బీసీసీఐ చెప్పుకొచ్చింది.

2) స్టంపింగ్ తో క్యాచ్ చెక్ 
 
IPL 2024 మ్యాచ్‌ల సమయంలో స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్థించబడినప్పుడు క్యాచ్‌ను చెక్ చేసే నియమాన్ని కొనసాగించాలని BCCI ఎంచుకుంది. ఈ నిర్ణయం ICC నిబంధనలకు లోబడి లేదు. స్టంపింగ్ నిర్ణయాలను ఖరారు చేసే ముందు క్యాచ్‌ల కోసం చెక్‌లను చేర్చడం ద్వారా BCCI ఫీల్డింగ్ వైపు నిష్పక్షపాతంగా ఉండేలా చూస్తుంది.

3) స్టాప్ క్లాక్ రూల్ లేదు 

జూన్ నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఐసీసీ మరోసారి స్టాప్ క్లాక్ రూల్ ను తీసుకొని వచ్చింది. అయితే ఈ రూల్ ఐపీఎల్ కు వర్తించదు. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్‌‌‌‌‌‌‌‌ ఉండకూడదన్న రూల్‌‌‌‌‌‌‌‌ తెచ్చింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఒక ఓవర్ వేసిన తర్వాత నిమిషంలోపు తర్వాతి ఓవర్ స్టార్ట్​ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాప్‌‌‌‌‌‌‌‌ క్లాక్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తారు. ఒకవేళ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో మూడుసార్లు 60 సెకండ్ల రూల్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించి వాటిని బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌  స్కోరులో జత చేరుస్తారు.

4) స్మార్ట్ రీప్లే సిస్టమ్ 
 
ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో మరో కొత్త టెక్నాల‌జీని అమ‌లు చేయ‌నున్నారు. ఎంపైర్లు తీసుకునే నిర్ణ‌యాల్లో మ‌రింత‌ కచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి రాబోయే ఐపీఎల్ సీజ‌న్ లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌ను అమ‌లు చేయనున్నారు.  ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉన్న ఒకే గదిలో కూర్చుంటారు. స్మార్ట్ రీప్లే సిస్టమ్‌లో భాగంగా ఫీల్డ్ అంతటా ఉన్న హాక్-ఐ ఎనిమిది హై-స్పీడ్ కెమెరాల ద్వారా పొందిన ఫుటేజీని అందిస్తారు.