హైదరాబాద్‌‌‌‌కు బీసీసీఐ మొండిచెయ్యి.. ఉప్పల్లో ఈ సారి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా లేదు

హైదరాబాద్‌‌‌‌కు బీసీసీఐ మొండిచెయ్యి.. ఉప్పల్లో ఈ సారి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా లేదు

న్యూఢిల్లీ: ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్‌‌‌‌ల్లో బీసీసీఐ ఒక్కటి కూడా హైదరాబాద్‌‌‌‌కు కేటాయించలేదు. వెస్టిండీస్‌‌‌‌, సౌతాఫ్రికాతో కలిసి ఈ సీజన్‌‌‌‌లో నాలుగు టెస్ట్‌‌‌‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. కానీ ఇందులో ఒక్కటి కూడా హైదరాబాద్‌‌‌‌కు ఇవ్వలేదు. 

వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో భాగంగా ఇండియా.. వెస్టిండీస్‌‌‌‌తో రెండు టెస్ట్‌‌‌‌లు అహ్మదాబాద్‌‌‌‌ (అక్టోబర్ 2–6), కోల్‌‌‌‌కతా (అక్టోబర్‌‌‌‌ 10–14)లో ఆడుతుంది. ఓ నెల విరామం తర్వాత సౌతాఫ్రికాతో పూర్తి స్థాయి సిరీస్‌‌‌‌లో పాల్గొంటుంది. తొలి టెస్టుకు ఢిల్లీ (నవంబర్‌‌‌‌ 14–18), రెండో టెస్టుకు గువాహటి (22–26) ఆతిథ్యమిస్తాయి. 

ఇక మూడు వన్డేలు వరుసగా రాంచీ (నవంబర్‌‌‌‌ 30), రాయ్‌‌‌‌పూర్‌‌‌‌ (డిసెంబర్‌‌‌‌ 3), విశాఖపట్నం (డిసెంబర్‌‌‌‌ 6)లో జరుగుతాయి. డిసెంబర్‌‌‌‌ 9, 11, 14, 17, 19న జరిగే ఐదు టీ20లకు వరుసగా కటక్‌‌‌‌, ముల్లన్‌‌‌‌పూర్‌‌‌‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌‌‌‌ వేదికలుగా ఖరారు చేశారు.