IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీ

IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీ

ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతున్న టీమిండియాకు గుడ్ న్యూస్. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ త్వరలో ఆస్ట్రేలియాకు పయనం కానున్నట్టు సమాచారం. నివేదికల ప్రకారం.. బీసీసీఐ మిగిలిన ఆస్ట్రేలియా పర్యటనకు మహ్మద్ షమీని తీసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉందట. రాబోయే మూడు టెస్టులకు షమీని ఎంపిక చేసేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్‌సిఎ నుండి షమీ తుది ఫిట్‌నెస్ ఫలితాలను బీసీసీఐ కోరిందని.. అతడు ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించబడిన తర్వాత షమీ తక్షణమే ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి భారత పేసర్ మహమ్మద్ షమీని ఎంపిక చేయాలని చాలా మంది భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత షమీ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాలో షమీ అనుభవం భారత్ కు ఎంతగానో పనికి వస్తుంది. కంబ్యాక్ లోనూ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. దీంతో షమీ బౌలింగ్ కోసం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.   

ALSO READ : IND vs AUS 2nd Test: ట్రావిస్ హెడ్ భారీ శతకం.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం

వన్డే ప్రపంచకప్‌లో  మహమ్మద్ షమీ అదరగొట్టాడు. మొదటి నాలుగు మ్యాచ్ లకు అతనికి అవకాశం దక్కకపోగా ఆడిన 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు పడగొట్టి లీగ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2023లో తన సంచలన ప్రదర్శనకు గాను ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు.