IPL 2025: ఫ్యాన్స్ కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. 13 వేదికలలో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ

IPL 2025: ఫ్యాన్స్ కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. 13 వేదికలలో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ

ఐపీఎల్ 18వ ఎడిషన్ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ సారి ఐపీఎల్ ప్రారంభ వేడుకలు వేడుకలు గ్రాండ్ గా ఏర్పాటు చేయనుందట. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు 13 వేదికలలో నిర్వహించనుంది. నివేదికల ప్రకారం ప్రారంభోత్సవ వేడుకల వైభవాన్ని అభిమానులందరికీ అందించాలని బీసీసీఐ కోరుకుంటోంది. సాధారణంగా ప్రతి సీజన్ లో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు తొలి మ్యాచ్ జరిగే వేదికపై మాత్రమే జరుగుతాయి.

ఈ సారి మాత్రం ఫ్యాన్స్ కోసం బీసీసీఐ తమ ప్రణాళికలు మార్చుకున్నట్టు సమాచారం. అభిమానులు అందరూ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు చూడాలని భారీ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. అయితే అన్ని వేదికల్లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించబడతాయనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2024లో ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ కు ముందు అభిమానులను అలరించడానికి ప్రతి వేదికలోని స్వదేశీ జట్టు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది.

శనివారం (మార్చి 22) కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. 35 నిమిషాల పాటు జరిగే ఈ వేడుకలో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన గానంతో  అలరించనుంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ నటి దిశా పటానీ తన డ్యాన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ జై షా తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.