IPL 2025: ఇకపై బౌలర్లకు పండగే.. పాత రూల్‌ను మళ్ళీ తీసుకొచ్చిన బీసీసీఐ

IPL 2025: ఇకపై బౌలర్లకు పండగే.. పాత రూల్‌ను మళ్ళీ తీసుకొచ్చిన బీసీసీఐ

ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆటగాళ్లు బంతిపై లాలాజలం వాడకూడదనే రూల్ ను ఎత్తేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆటగాళ్లు బంతిపై లాలాజలాన్ని వాడకూడదని బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బౌలర్లకు గుడ్ న్యూస్ చెబుతూ బంతిపై ఉమ్మి రాసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం (మార్చి 20) ముంబైలోని క్రికెట్ సెంటర్‌లో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని క్రిక్‌బజ్‌కు తెలిపినట్టు సమాచారం. 

కొత్త సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో 10 మంది కెప్టెన్లు పాల్గొనగా.. మెజారిటీ కెప్టెన్లు ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలుస్తుంది. బంతికి లాలాజలం రాయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. కొవిడ్ సమయంలో ఈ రూల్ ను బీసీసీఐ నిషేధించగా.. 2022 ఐసీసీ ఈ నిషేధాన్ని శాశ్వతం చేసింది.  బీసీసీఐ మరల ప్రవేశ పెట్టిన ఈ రూల్ పై బౌలర్లు సంతోషంగా ఉన్నారు. బౌలర్లు బంతి పాత పడ్డ తర్వాత దానికి ఉమ్మి రాసి రివర్స్ స్వింగ్ రాబట్టుకోవచ్చు. 

ALSO READ | IPL 2025 SRH: నాలుగో ప్లేయర్ ఎవరు..? ఓవర్సీస్ క్రికెటర్‌పై సన్ రైజర్స్ గందరగోళం

బౌలర్లు బంతిపై లాలాజలం వాడడానికి అనుమతి ఇవ్వాలని.. ఈ విషయం గురించి తరచుగా చర్చించేవారని స్టార్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మాట్లాడారు. దీంతో పాటు బౌలర్లకు అనుకూలంగా మరో రూల్ ను బీసీసీఐ తీసుకొచ్చింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో రెండు కొత్త బంతులని ఉపయోగించవచ్చు అనే రూల్ ను ప్రవేశపెట్టింది. రెండో కొత్త బంతిని 11 ఓవర్ నుంచి తీసుకోవచ్చు. మంచు కారణంగా బౌలింగ్ చేయడానికి కష్టంగా మారుతున్న తరుణంలో ఈ రూల్ తీసుకొచ్చింది.

బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రూల్స్ తో బంతికి బ్యాట్ కు మధ్య హోరా హోరీ సమరాన్ని చూడొచ్చు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. శనివారం (మార్చి 22)  గ్రాండ్ గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది.