BCCI Awards 2025: బీసీసీఐ నమన్‌ అవార్డులు.. విజేతలు వీరే..

BCCI Awards 2025: బీసీసీఐ నమన్‌ అవార్డులు.. విజేతలు వీరే..

గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను బీసీసీఐ నమన్‌ అవార్డుల(BCCI Naman Awards 2025)తో సత్కరించింది. శనివారం(ఫిబ్రవరి 01) ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో జాతీయ జట్టు స్టార్లు, దేశవాళీ క్రికెటర్లు అందరూ తళుక్కుమన్నారు. 

స్పీడ్‌గన్ జస్ప్రీత్ బుమ్రా ఉత్తమ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోగా, మహిళల విభాగంలో స్మృతి మంధానను ఈ అవార్డు వరించింది. ఇక భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

విజేతల పూర్తి జాబితా ..

  • సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు: సచిన్‌ టెండూల్కర్
  • పాలి ఉమ్రిగర్‌ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌: జస్ప్రీత్ బుమ్రా
  • ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌: స్మృతి మంధాన
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషుల విభాగంలో): సర్ఫరాజ్‌ ఖాన్‌
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళల విభాగంలో): ఆశా శోభనా
  • బీసీసీఐ స్పెషల్‌ అవార్డు: రవిచంద్రన్‌ అశ్విన్‌(రిటైర్)
  • మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు: స్మృతి మంధాన
  • మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు: దీప్తి శర్మ
  • దేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్‌: అక్షయ్‌ తోట్రే

లాలా అమర్‌నాథ్‌ అవార్డులు

  • బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (డొమెస్టిక్‌ లిమిటెడ్‌ ఓవర్స్‌ కాంపిటీషన్‌): శశాంక్‌సింగ్‌
  • బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (రంజీ ట్రోఫీ): తనుశ్‌ కోటియన్‌
  • బీసీసీఐ దేశవాళీ టోర్నీల్లో అత్యుత్తమ జట్టు: ముంబై (రంజీ ట్రోఫీ, సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ, విజయ్ మర్చంట్ ట్రోఫీ)

చిదంబరం ట్రోఫీ విజేతలు

  • U19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు: కావ్యా 
  • U19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు: విష్ణు భరద్వాజ్‌
  • U-23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్ గ్రూప్): అత్యధిక వికెట్లు నీజెఖో రూపేయో
  • U23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు: హేమ్‌ ఛెత్రి
  • U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు: పి. విద్యుత్‌
  • U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు: కేవీ అనీశ్‌

జగన్‌మోహన్ దాల్మియా ట్రోఫీ విజేతలు

  • బెస్ట్‌ విమెన్‌ క్రికెటర్‌ సీనియర్‌ డొమెస్టిక్‌: ప్రియా మిశ్రా
  • బెస్ట్‌ విమెన్‌ క్రికెటర్‌ జూనియర్‌ డొమెస్టిక్‌: ఈశ్వరీ అవసరే
  • U16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు: హెచ్‌. జగన్నాథన్‌
  • జU16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు: లక్ష్య రాయ్‌చందానీ

మాధవ్‌రావ్‌ సింధియా అవార్డులు 

  • రంజీ ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు: మోహిత్‌ జాంగ్ర
  • రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు: తనయ్‌ త్యాగరాజన్‌
  • రంజీ ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు: అగ్ని చోప్రా
  • రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు: రికీ భూయ్‌