పింక్ కలర్ బాల్‌తో టెస్ట్ క్రికెట్ నాశనం అవుతుంది: జైషా

పింక్ కలర్ బాల్‌తో టెస్ట్ క్రికెట్ నాశనం అవుతుంది: జైషా

సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో వైట్ బాల్, టెస్టు క్రికెట్ లో రెడ్ బాల్ ఉపయోగిస్తారు. అయితే తొలిసారి ఆస్ట్రేలియా క్రికెట్ డే నైట్ టెస్టులో భాగంగా పింక్ బాల్ ని పరిచయం చేసింది. వైట్ బాల్, రెడ్ బాల్ తో పోల్చుకుంటే  ఈ బంతి తక్కువ పరిమాణంలో ఉండి  స్వింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది. భారత్ తొలిసారిగా 2019 లో పింక్ బాల్ తో బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత శ్రీలంకపై బెంగళూరు వేదికగా మరో పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఇంగ్లాండ్ పై 2021 లో మరో టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత్.. ఈ మూడు టెస్టుల్లోనూ విజయం  సాధించింది. 

2024 జనవరి లో టీమిండియాపై 5 టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు భారత గడ్డపై ఇంగ్లాండ్ అడుగుపెట్టబోతుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ లో  ఒక్క డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా షెడ్యూల్ లో లేదు. దీంతో ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పింక్ బాల్ టెస్టు లు నిర్వహించాలని కోరింది.  అయితే ఈ ప్రతిపాదనను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జైషా భారత్‌లో పింక్ బాల్ టెస్టులు నిర్వహించేందుకు నిరాకరించి దానికి తగిన కారణాలు చెప్పుకొచ్చారు.
 
భారత్‌లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ని చూసేందుకు ప్రజల్లో ఆసక్తి పెంచాల్సిన అవసరం ఉందని.. గతంలో పింక్-బాల్ టెస్టులు రెండు-మూడు రోజుల్లోనే ముగిశాయని..ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ నాలుగైదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్‌ని చూడాలని కోరుకుంటారని.. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని WPL 2024 వేలం ముగిసిన తర్వాత షా అన్నారు.

భారత్ వేదికగా ఫిబ్రవరి 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ పేలవంగా సాగింది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో  జరిగిన ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.