సకారియా బౌలింగ్ యాక్షన్ సరైనదే: సమాచార లోపమంటూ బీసీసీఐ క్లారిటీ

సకారియా బౌలింగ్ యాక్షన్ సరైనదే: సమాచార లోపమంటూ బీసీసీఐ క్లారిటీ

ఐపీఎల్ వేలానికి ముందు సౌరాష్ట్ర ఆటగాడు చేతన్ సకారియాతో పాటు ఏడుగురు బౌలింగ్ యాక్షన్ పై  బీసీసీఐ అనుమానం వ్యక్తం చేసింది. వీరి యాక్షన్‌ సరిగా లేదంటూ కలిగి ఉన్నారంటూ వీరిని నిషేధించకుండా పక్కన పెట్టింది. బీసీసీఐ శుక్రవారం విడుదల చేసిన జాబితాలో తనుష్‌ కోటియన్‌ (ముంబై), రోహన్‌ కన్నుమ్మల్‌ (కేరళ), చిరాగ్‌ గాంధీ (గుజరాత్‌), సౌరభ్ దూబే (విదర్భ), అర్పిత్‌ గులేరియా (హిమాచల్‌ ప్రదేశ్‌)లు ఉన్నారు.  అయితే  తాజాగా బీసీసీఐ సకారియా అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ సరిగానే ఉందని వెల్లడించింది. 

ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు జైషా మాట్లాడుతూ.. "సకారియా బౌలింగ్ యాక్షన్ సరిగానే ఉంది. సమాచార లోపం కారణంగానే ఇదంతా జరిగింది. ఇదే విషయాన్నీ మేము ఫ్రాంచైజీలకు అందజేశాము. అని తెలిపారు".  చేతన్ సకారియా IPLలో రాజస్థాన్ రాయల్స్,  ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 19 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. 2021లో శ్రీలంక పర్యటనలో భారత జట్టు  తరపున ఒక వన్డే, రెండు T20Iలు ఆడాడు. 
      
ఐపీఎల్ 2023లో సకారియా గాయం కారణంగా దూరమయ్యాడు. 2023 లో దేశవాళీ ట్రోఫీలైనా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడలేదు. ఐపీఎల్ వేలంలో సకారియా తన బేస్ ధరను రూ.50 లక్షలుగా ఉంచుకున్నాడు. ఐపీఎల్ 2024 వేలం (IPL 2024 Auction) డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో జరగనుంది.