
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. పర్యాటకులపై అత్యంత క్రూరంగా తెగబడ్డ టెర్రరిస్టులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. 20 మంది తీవ్ర గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై దేశం అంతా ముక్త కంఠంతో బాధితుల పక్షాన మద్ధతుగా నిలబడింది.
ఉగ్రదాడి మృతులకు బీసీసీఐ సంతాపం ప్రకటించింది. అందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 23, బుధవారం) హైదరాబాద్, ముంబై మధ్య జరిగే మ్యాచ్ లో కొన్ని కీలక మార్పులు చేయనుంది. SRH vs MI మధ్య జరిగే IPL మ్యాచ్‌లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తారు.
ALSO READ : PahalgamAttack: పహల్గామ్ ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు.. త్రుటిలో తప్పించుకున్న సెలబ్రిటీ జంట
మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లతో పాటు మిగతా సిబ్బంధి ఒక్క నిమిషం మౌనం పాటిస్తారు. అంతేకాకుండా ఈ రోజు మ్యాచ్‌లో చీర్ లీడర్లు ఉండరు. అంటే బౌండరీలు వచ్చినప్పుడు, వికెట్ దొరికినప్పుడు, గెలిచిన సందర్భాలలో సెలబ్రేషన్స్ చేయడానికి చీర్ లీడర్స్ ఉండరు.