IPL 2024: రుతురాజ్, రాహుల్ లకు భారీ జరిమానా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి

IPL 2024: రుతురాజ్, రాహుల్ లకు భారీ జరిమానా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి

ఐపీఎల్ 17వ సీజన్ లో ఒకే మ్యాచ్ లో ఇరుజట్ల కెప్టెన్లకు భారీ జరిమానా విధించింది బీసీసీఐ. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరుజట్లు స్లో ఓవరేట్ ను నమోదు చేశాయి. 

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. నిర్ణీత సమయంలో ఇన్నింగ్స్ లను ముగించకపోవడంతో బీసీసీఐ.. లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్, చెన్నై కెప్టెన్ రుతురాజ్ లకు రూ.12 లక్షలు ఫైన్ విధించింది. ఒక సీజన్ లో ఒకే మ్యాచ్ లో ఇద్దరు కెప్టెన్లకు జరిమానా వేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక, ఈ సీజన్ లో ఇప్పటికే స్లో ఓవర రేట్ కారణంగా గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ లకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

ఇక, శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నైపై లక్నో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా(57 నాటౌట్) అర్థ శతకంతో రాణించగా.. చివర్లలో ఎంఎస్ ధోనీ(28 నాటౌట్) మరోసారి మెరుపులు మెరిపించాడు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 19 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ కెఎల్ రాహుల్(82), ఓపెనర్ డికాక్(54)లు అర్థ శతకాలతో రాణించారు.