ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా వరల్డ్ కప్ హడావుడే నడుస్తుంది. 12 ఏళ్ళ తర్వాత భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడం, స్వదేశంలో వరల్డ్ కప్ జరగనుండడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ మెగా ఫైనల్ కోసం బీసీసీఐ గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తుంది. స్టార్ స్పోర్ట్స్ లో 7 గంటల నుండే లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (నవంబర్ 19) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కు విరామ సమయాల్లో కూడా గ్రాండ్ గా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం
టాస్ వేసిన తర్వాత 1:35 నుంచి 1:55
మధ్యలో భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది. మొత్తం తొమ్మిది యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ ప్రో ప్రకటన చేసింది. ఇప్పటికే ఆ దిశగా రిహార్సల్స్ కూడా మొదలయ్యాయి.
మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్
గుజరాత్ సింగర్ ఆదిత్య గద్వీ తన సింగింగ్ తో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. అయితే ఒక ఇన్నింగ్స్ కు రెండు డ్రింక్స్ బ్రేక్స్ ఉంటాయి. మరి వీటిలో ఏ ఇన్నింగ్స్ అనే విష్యం తెలియాల్సి ఉంది.
ఇన్నింగ్స్ బ్రేక్
మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత ఇరు జట్లకు లంచ్ విరామం ఉంటుంది. 40 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు బ్రేక్ ఇస్తారు. ఈ సమయంలో బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్, జోనితా గాంధీ, నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, అకాసా సింగ్ మరియు తుషార్ జోషి వంటి ప్రతిభావంతులైన గాయకులు ప్రపంచ కప్ వేదికను అలంకరించనున్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా "లెహ్రా దో," "దేవ దేవా," "కేసరియా" వంటి ప్రసిద్ధ ట్రాక్‌లను వీరు పాడటానికి రెడీగా ఉన్నారు.
రెండో ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్
లేజర్ లైట్ షో తో గ్రౌండ్ మొత్తాన్ని ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అహ్మదాబాద్ స్కైస్‌ను 1200 కంటే ఎక్కువ లైట్లతో ప్రకాశిస్తుంది.