IPL 2028: 2028 నుండి అదనంగా మరో 20 మ్యాచ్‌లు.. హింట్ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్

IPL 2028: 2028 నుండి అదనంగా మరో 20 మ్యాచ్‌లు.. హింట్ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్

ఐపీఎల్ అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందనున్నట్టు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో 20 మ్యాచ్‌లు పెంచే ఆలోచనలో ఉన్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోందట. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ స్వయంగా వెల్లడించారు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ.. 2028 నాటికి ఈ మార్పులు అమలు చేయబడతాయని ధుమల్ అన్నారు. 

ధుమల్ ఒక ఇంటర్వ్యూలో ఈ మార్పుకు గల కారణాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్  రెండు గ్రూపులుగా విభజించబడింది. గ్రూప్ ఏ లోని జట్లు అదే గ్రూప్ లోని జట్లతో ఒక మ్యాచ్.. గ్రూప్ బి లోని జట్లతో ఒకొక్క మ్యాచ్ ఆడుతున్నాయి. ప్రస్తుతం ఒక జట్టు 14 మ్యాచ్ లు  ఆడుతుంది. ఒక మిగిలిన 9 జట్లతో రెండు మ్యాచ్ లు జరిపే ఆలోచనలో ఉంది. అలా జరిగితే టోర్నీలో మరో 20 మ్యాచ్ లు పెరిగే అవకాశం ఉంది. 2028 ఐపీఎల్ సమయానికల్లా జట్లకు పూర్తి హోమ్-అండ్-అవే షెడ్యూల్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు.. 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 మధ్య జరుగుతుంది. దీంతో పాటు ఒక్కో సీజన్‌లో ఎన్ని మ్యాచ్ లు జరుగుతాయో మ్యాచ్‌ల జాబితాను రిలీజ్ చేసింది. 2023, 2024 సీజన్ లో 74  మ్యాచ్ లు జరిగాయి. ప్రస్తుత ఐపీఎల్   సీజన్ లో కూడా 74 మ్యాచ్ లే జరగనున్నాయి. 2026, 2027 ఐపీఎల్ సీజన్ లో మాత్రం మొత్తం 84 మ్యాచ్ లు జరుగుతాయి. 2028 ఐపీఎల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ల సంఖ్య 94 కు చేరే అవకాశాం ఉన్నట్టు సమాచారం. 

ప్రస్తుతం ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు తలబడుతున్నాయి. ఒక్కో జట్టు కొన్ని జట్లతో రెండు.. మరికొన్ని జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది. అయితే 2026,2027 ఐపీఎల్ లో మాత్రమే ప్రతి జట్టు ఇతర జట్లతో రెండు మ్యాచ్ లు ఆడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే జరిగితే అభిమానులకు రెండున్నర నెలలు పండగే.