ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్‌తో మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఏప్రిల్ 1న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ పంత్ కు రూ. 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తర్వాత వెంటనే ఢిల్లీ కెప్టెన్ వెంటనే అదే తప్పును రిపీట్ చేశాడు. నిన్న (ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండోసారి స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పంత్‌కి రూ. 24 లక్షల జరిమానా విధించబడింది.
కెప్టెన్ పంత్ కు మాత్రమే కాదు.. ఢిల్లీ జట్టులోని ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ తో సహా ఢిల్లీ జట్టులోని ప్లేయింగ్ 11 లో ఉన్న వారికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది. పంత్ మరోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్షకు గురయితే 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ స్లో ఓవర్ రేట్‌తో 12 లక్షల జరిమానా ఎదుర్కొన్న తొలి ప్లేయర్ గా నిలిచాడు.
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టారు. దీంతో పంత్ ఫీల్డింగ్ సెట్ చేయడంలో తడబడి ఇన్నింగ్స్ ను నిర్ణీత సమయానికి పూర్తి చేయలేకపోయాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లీగ్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరు నమోదు చేస్తూ 106 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. సునీల్ నరైన్ (39 బాల్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85), అంగ్‌క్రిష్ రఘువంశీ (27 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) ఫిఫ్టీలతో చెలరేగడంతో తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 272/7 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ 166 పరుగులకే పరిమితమైంది.
Rishabh Pant fined 24 Lakhs for maintaining slow overrate against KKR.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024
- It's the 2nd offense of DC...!!! pic.twitter.com/wQuagE4F1w