రూ.6 కోట్లకు కొంటే.. ఢిల్లీ క్యాపిటల్స్కు హ్యాండిస్తావా..? రెండేళ్లు IPL ఆడకు.. బ్రూక్పై బీసీసీఐ నిషేధం

రూ.6 కోట్లకు కొంటే.. ఢిల్లీ క్యాపిటల్స్కు హ్యాండిస్తావా..? రెండేళ్లు IPL ఆడకు.. బ్రూక్పై బీసీసీఐ నిషేధం

ఇంగ్లండ్ క్రికెటర్, యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ వేటు వేసింది. రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా నిషేధం విధించింది. 2025, 2026 ఐపీఎల్ సీజన్స్లో ఆడే అర్హత హ్యారీ బ్రూక్కు లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. వేలంలో ఫ్రాంచైజీలు దక్కించుకున్న తర్వాత గాయాల పాలైతే తప్ప ఇతర ఏ కారణంతో విదేశీ ఆటగాళ్లు వైదొలిగినా రెండేళ్ల నిషేధం తప్పదని ఐపీఎల్ నియమనిబంధనల్లో స్పష్టంగా ఉంది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో హ్యారీ బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ 2025 మొదలు కావడానికి పట్టుమని పదిహేను రోజులు కూడా లేదు. అలాంటి సమయంలో.. ఐపీఎల్ నుంచి తాను వైదొలుగుతున్నట్టు బ్రూక్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ప్రకటన చేశాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొని ఇప్పుడు వైదొలగాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు, ఆ జట్టు అభిమానులకు బ్రూక్ క్షమాపణలు కూడా చెప్పాడు.

Also Read : హండ్రెడ్ లీగ్‌లో కూడా ఒకే గూటికి చేరిన దిగ్గజాలు

ఐపీఎల్లో ఆడటం కంటే తన దేశం తరపున ఆడటమే ముఖ్యమని బ్రూక్ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా మార్చి 9, 2025న స్పష్టం చేశాడు. తన నిర్ణయాన్ని అందరూ ఆమోదించరన్న విషయం తనకు తెలుసని బ్రూక్ తన పోస్ట్లో చెప్పుకొచ్చాడు.  జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. 2025-27 టెస్ట్ ఛాంపియన్స్ షిప్లో భాగంగా  ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి సిరీస్ ఇది. టెస్టుల్లో బ్రూక్ మంచి ఫామ్లో ఉన్నాడు. 50కి పైగా యావరేజ్తో ఈ ఇంగ్లండ్ యువ క్రికెటర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. పాకిస్థాన్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసి బ్రూక్ చరిత్ర సృష్టించాడు.