IPL 2025 Auction rules: మహేంద్రుడితో మాములుగా ఉండదు.. ఐపీఎల్‌లో ఆ రూల్ ధోనీ కోసమే

IPL 2025 Auction rules: మహేంద్రుడితో మాములుగా ఉండదు.. ఐపీఎల్‌లో ఆ రూల్ ధోనీ కోసమే

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన మహేంద్రుడు.. ఐపీఎల్ లో అంతకు మించిన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మోస్ట్ సక్సెస్ ఫుల్ టీంగా నడిపాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK) మ్యాచ్ ఏ నగరంలో జరిగిన అభిమానులు పోటెత్తుతారు. మహేంద్రుడి పట్ల అభిమానుల్లో ఉన్న ఆ ఆదరణను చూసి చెన్నై యాజమాన్యం అతన్ని వదులుకునే సాహసం చేయడం లేదు.

ఈ నేపథ్యంలో ఆ జట్టు యాజమాన్యం.. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముందు వింత ప్రతిపాదనను ఉంచింది. బుధవారం(జులై 31) ముంబైలో జరిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీల సమావేశంలో ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వర్గీకరించాలని చెన్నై సూచించింది. ఈ రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు కావాలి. ధోని నాలుగేళ్ల క్రితం 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు కనుక ఈ నిబంధనను సడలించాలని చెన్నై యాజమాన్యం తెలిపింది.

ALSO READ :IPL 2025 Auction rules: ఐపీఎల్ 2025 ఆక్షన్.. రిటెన్షన్స్‌‌ రూల్స్ వచ్చేశాయి

తాజాగా బీసీసీఐ ప్రకటించిన రూల్స్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ ను ప్రవేశపెట్టారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కలిపించింది. ఈ రూల్ తో ఫ్రాంచైజీలు సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో గరిష్టంగా ఇద్దరు.. కనిష్టంగా ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ. 4 కోట్లు చెల్లించాలి. ధోనీ కోసం ఈ రూల్ మరోసారి తిరిగి ప్రవేశపెట్టినట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అంతేకాదు రూల్ నెంబర్ 7 అంటూ లో జత చేయడంతో ధోనీ కోసమే ఈ రూల్ మరల తీసుకువచ్చారని స్పష్టంగా అర్ధమవుతుంది. మాహీని చెన్నై సూపర్ కింగ్స్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకునే అవకాశముంది. ధోనీకి దాదాపు ఇదే చివరి సీజన్ కావడంతో అతను  అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా జట్టులో కొనసాగే అవకాశం కనిపిస్తుంది.