
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (BGT) టీమిండియా ఓటమి తరువాత బీసీసీఐ భారీ మార్పులకు తెర లేపింది. టీమిండియలో నలుగురు కోచ్ సిబ్బందిని బీసీసీఐ తొలగించింది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ర్యాన్ టెన్ డస్చేట్, సోహం దేశాయిలను బీసీసీఐ తొలగించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీం స్టాఫ్లో బీసీసీఐ భారీ మార్పులు చేయడం గమనార్హం.
ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్థానంలో ప్రస్తుతానికి అసిస్టెంట్ కోచ్ నుంచి తప్పించిన టెన్ డస్చేట్ ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్థానంలో ఎవరిని రీప్లేస్ చేస్తారనేది ప్రస్తుతానికి తెలియదు. మొత్తంగా చెప్పాలంటే.. టీమిండియా బ్యాటింగ్, ఫీల్డింగో కోచ్లపై బీసీసీఐ కన్నెర్ర చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శనే ఇందుకు కారణం. మరోసారి అలా జరగకూడదని ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందే బీసీసీఐ ఈ మార్పులకు పూనుకుంది.
Also Read:-ధోనీకి భారీ నష్టం.. కెప్టెన్ కూల్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన జెన్సోల్ స్టాక్..
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అట్టర్‌ఫ్లాఫ్ ప్రదర్శనతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.ఇండియా10 ఏండ్ల తర్వాత బోర్డర్–గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుని విమర్శల పాలైంది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం విదితమే. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3–1తో సొంతం చేసుకుంది. దశాబ్ద విరామం తర్వాత బోర్డర్–గావస్కర్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.