T20 World Cup 2024 Prize Money: ఆటగాళ్లపై కాసుల వర్షం.. రోహిత్ సేనకు 125 కోట్ల ప్రైజ్ మనీ

T20 World Cup 2024 Prize Money: ఆటగాళ్లపై కాసుల వర్షం.. రోహిత్ సేనకు 125 కోట్ల ప్రైజ్ మనీ

T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ గెలుచుకు భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీ20 టైటిల్ గెలుచుకోవడంపై ప్రశంసలు కురిపించారు. ICC T20 ప్రపంచ కప్ చరిత్రలో టోర్నమెంట్‌ను అజేయంగా గెలుచుకున్న మొదటి జట్టు అని ’’ బీసీసీఐ చైర్మన్ జై షా అభినందించారు.  రోహిత్ కెప్టెన్సీలో భారత్ జ ట్టు అద్భుతమైన విజయం  సాధించినందుకు..టీమిండియా జట్టుకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. 

శనివారం (జూన్ 29, 2024) అమెరికాలోని బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించి T20 ఫార్మాట్ లో ప్రపంచ టైటిల్ ను అందుకుంది. టీమిండియా జట్టు సమిష్టి కృషితో టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. అద్భుతమై ఆట తీరుతో విమ ర్శకుల నోర్లు మూయించారు. టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతమైన ఆట తీరు స్పూర్తిదాయకమే కాదు.. క్రికెట్ లో దేశ ప్రతిష్టను పెంచారన్నారు బీసీసీఐ చైర్మన్ జై షా.

విజేత టీమిండియాకు ఐసీసీ ప్రైజ్ మనీ ఎంతంటే.. 

అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన ఇండియా ఎంత ప్రైజ్ మనీని సొంతం చేసుకోనుందనే విషయంపై అందరి దృష్టి పడింది. ఐసీసీ ప్రకటన ప్రకారం..టోర్నీ విజే తగా నిలిచిన ఇండియాకు 2.45 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించనుంది. ఇది మన కరెన్సీలో సుమారు రూ. 20.42 కోట్లు. ఇక రన్నర్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికాకి ప్రైజ్ మనీ కింద సుమారు రూ. 10.6 కోట్లు. మరొకవైపు సెమీ ఫైనల్స్ కి చేరిన టీమ్స్ అయిన ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ టీమ్స్ ఒక్కొక్కరు రూ. 6.56 కోట్లను అందిం చను న్నారు. 

ఇక సూపర్8కి చేరిన టీమ్స్ కి ఒక్కొక్కరికి రూ. 3.19 కోట్లు..తొమ్మిదవ స్థానం నుంచి 12 వ స్థానంలో నిలిచిన టీమ్స్ ఒక్కొక్కరికి రూ. 2.06 కోట్లు, చివరగా 13వ స్థానం నుం చి 20వ స్థానంలో నిలిచిన ఒక్కో టీమ్ కి రూ. 1.87 కోట్లను ప్రైజ్ మనీగా ఐసీసీ అందించనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మినహా గెలిచినా ప్రతి మ్యాచ్ కి ఒక్కో టీమ్ కి అదనంగా రూ. 2.29 కోట్లను ఐసీసీ అందించనుంది.