
రాజ్‌కోట్ : వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో పోటీ పడే ఇండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. ఏడాది పాటు హార్దిక్ టీ20ల్లో ఇండియాను నడిపించాడు.
కానీ, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత రోహిత్, కోహ్లీ తిరిగి టీ20 ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీలోనే ఇండియా వరల్డ్ కప్ ఆడుతుందని బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జై షా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ ద్రవిడ్, రోహిత్ సమక్షంలోనే చెప్పారు.