ఐసీసీ పీఠంపై జై షా గురి!

ఐసీసీ పీఠంపై జై షా గురి!
  •     తదుపరి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా పోటీకి మొగ్గు
  •     ఎన్నిక లాంఛనమే అంటున్న బోర్డు వర్గాలు

ముంబై: బీసీసీఐ సెక్రెటరీ జై షా  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ పదవిపై గురి పెట్టారు.  గ్రెగ్‌‌‌‌‌‌‌‌ బార్క్‌‌‌‌‌‌‌‌లే తర్వాత ఐసీసీ తదుపరి చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోసం జై షా  ప్రధాన అభ్యర్థిగా పోటీ పడతారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. పలు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు ఉండటంతో  షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని బోర్డు నమ్మకంగా ఉందని అంటున్నాయి. క్రికెట్ బాడీ చీఫ్‌‌‌‌‌‌‌‌ పదవికి పోటీ చేసేందుకు అర్హులైన  ఐసీసీ డైరెక్టర్లు (16 మంది)  ఈనెల 27వ తేదీ లోపు  నామినేషన్లు వేసుకోవచ్చు. జై షాకు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా బోర్డులు మద్దతు ఇవ్వనున్నాయి. 

ప్రస్తుత చైర్మన్‌‌‌‌‌‌‌‌ గ్రెగ్‌‌‌‌‌‌‌‌ మూడో టర్మ్‌‌‌‌‌‌‌‌ ఆ పోస్టులో ఉండేందుకు అర్హుడే అయినా తను తిరిగి పోటీ చేయడం లేదు. దాంతో, జై షాకు మార్గం సుగమం కానుంది. ఒకవేళ 36 ఏండ్ల  షా  గెలిస్తే  యంగెస్ట్  ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గా రికార్డు సృష్టిస్తారు. గతంలో ఇండియా నుంచి జగ్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ దాల్మియా, శరద్ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌. శ్రీనివాసన్‌‌‌‌‌‌‌‌, శశాంక్ మనోహర్ ఈ పదవిలో పని చేశారు. ప్రస్తుతం బీసీసీఐ నియమించిన ఐసీసీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న షా.. ఐసీసీలో అత్యంత కీలకమైన ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, కమర్షియల్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.  ఒకవేళ జై షా ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ అయితే   బీసీసీఐ సెక్రటరీ పోస్టు ఖాళీ అవ్వనుంది. మరో ఏడాది కాలం ఉన్న ఈ పదవిని చేపట్టేందుకు రాజీవ్ శుక్లా, ఆశీష్‌‌‌‌‌‌‌‌ షేలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అరుణ్ ధూమల్‌‌‌‌‌‌‌‌ పేర్లు వినిపిస్తున్నాయి.