జనవరి 12న బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నిక

జనవరి 12న బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నిక

న్యూఢిల్లీ : బీసీసీఐ కొత్త సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌లను ఎన్నుకునేందుకు జనవరి 12న ముంబైలో జరిగే  ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌‌‌‌‌‌‌‌జీఎం) ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.  జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టడంతో సెక్రటరీ పోస్టు, ఆశీష్ షెలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్ర క్యాబినెట్‌‌‌‌‌‌‌‌లో మంత్రి అవ్వడంతో ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు ఖాళీ అయింది.

ఈ విషయంపై  శనివారం జరిగిన అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో బోర్డు పెద్దలు చర్చించారు. ఎస్‌‌‌‌‌‌‌‌జీఎం తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర సంఘాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అచల్‌‌‌‌‌‌‌‌ కుమార్ జ్యోతిని ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రతిపాదించారు.