ప్రస్తుతం అభిమానుల దృష్టాంతా ఐపీఎల్ మీదే ఉంది. ఈ క్యాష్ లీగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ పొట్టి సమరానికి మరో నెల రోజులకు పైగా సమయం ఉన్నా.. జట్టును మాత్రం మే 1 లోపు ప్రకటించాలని ఐసీసీ ఇప్పటికే తెలియజేసింది. ఈ క్రమంలో టీమిండియా టీ20 వరల్డ్ జట్టును ఎప్పుడు ప్రకటిస్తారో ఆసక్తికరంగా మారింది. అయితే భారత జట్టును ఏప్రిల్ 27 లేదా ఏప్రిల్ 28 న ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
2024 T20 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఓపెనర్ రోహిత్ శర్మ.. ఏప్రిల్ 27 న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. దీంతో అదే రోజు భారత సెలక్టర్లతో రోహిత్ శర్మ జాయిన్ కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్ తో కూడిన 10 మంది సభ్యులు దాదాపుగా ఖరాయనట్టు సమాచారం. మిగిలిన 5 గురు ఆటగాళ్లల్లో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.
Indian team for the T20I World Cup is likely to be picked on April 27th or 28th. [Abhishek Tripathi From Dainak Jagran] pic.twitter.com/CD7c0oWQnq
— Johns. (@CricCrazyJohns) April 20, 2024