
పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధం తర్వాత.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్ తో ఇక నుంచి క్రికెట్ మ్యాచులు ఆడేది లేదని స్పష్టం చేసింది. తటస్థ వేదికలపైన కూడా పాక్ తో మ్యాచ్ లు ఆడేది లేదని.. ఇది ఫైనల్ అని తేల్చి చెప్పింది బీసీసీఐ.
అది వరల్డ్ కప్ అయినా.. ఇంకే సిరీస్ అయినా.. పాకిస్తాన్ తో ఫేస్ టూ ఫేస్ క్రికెట్ మ్యాచ్ ఇక ఉండదు.. ఉండబోదు అని స్పష్టం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. బీసీసీఐ. ప్రస్తుతం పాక్ తో.. ఇండియా ఇతర దేశాల్లో ఆడుతుంది.. ఇక నుంచి అలాంటి వేదికపై కూడా ఆడేది లేదని.. ఇందులో రాజీ పడేది లేదని కూడా వెల్లడించింది బీసీసీఐ.
భారత్ చివరిసారిగా 2008లో పాకిస్తాన్ దేశం వెళ్లి.. అక్కడ మ్యాచ్ లు ఆడింది. ఆ తర్వాత రెండు దేశాలు ఫేస్ టూ ఫేస్ ఆడలేదు. ఐసీసీ వరల్డ్ కప్ లాంటి మ్యాచుల్లోనూ.. ఇతర దేశాల్లో ఆడుతూ వచ్చింది. ఇక నుంచి పాకిస్తాన్ తో ఎలాంటి మ్యాచులు ఆడకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
ఐసీసీ నిర్వహించే సిరీస్ ల విషయంలో ఆడాలా వద్దా అనేది.. భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఉంటుందని.. ప్రభుత్వం అనుమతి ఇస్తే అప్పుడు ఆలోచిస్తామని అంటోంది బీసీసీఐ. పాకిస్తాన్ ఎలాంటి దేశమో ఐసీసీకి కూడా తెలుసు అని స్పష్టం చేస్తోంది బీసీసీఐ. ఐసీసీ సిరీస్ విషయంలో ఆయా సందర్భాన్ని బట్టి.. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది బీసీసీఐ.