మహిళా క్రికెట్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఇకనుంచి దేశవాళీ టెస్ట్ సమరం

మహిళా క్రికెట్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఇకనుంచి దేశవాళీ టెస్ట్ సమరం

దేశంలో మహిళా క్రికెట్ ను ఎంకరేజ్ చేస్తూ బీసీసీఐ ఒక గొప్ప శుభవార్త చెప్పింది. ఇక నుంచి దేశవాళీ క్రికెట్ లో కూడా రెడ్ బాల్ టోర్నీ ప్రారంభం కానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహిళలు దేశవాళీ వన్డే, టీ20  వైట్ బాల్ టోర్నీలు మాత్రమే ఆడుతున్నారు. తాజాగా వారు డొమెస్టిక్ క్రికెట్ లో టెస్టు మ్యాచ్ లు నిర్వహించే విధంగా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్-ఈస్ట్ జోన్‌ల ఆధారంగా విభజించబడిన ఆరు జట్లు ఈ టోర్నమెంట్ లో పోటీ పడతాయి. టోర్నమెంట్ మార్చి 29 నుండి ప్రారంభం కానుంది. మార్చి 29, 30, 31 తేదీల్లో క్వార్టర్స్‌ పోటీ జరగనుంది. క్వార్టర్స్‌లో విజేతలుగా నిలిచిన జట్లు.. సెమీఫైనల్‌కు చేరుకుంటారు. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఏప్రిల్ 5 నుండి 7 వరకు జరిగే అవకాశం ఉంది.ఫైనల్ ఏప్రిల్ 9, 10 మరియు 11 తేదీల్లో జరుగుతుంది.

Also Read:ఊహించని రీతిలో విలియంసన్ రనౌట్

ప్రస్తుతం దేశంలో మహిళల ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించబడింది. ఈ మెగా ఫైనల్ మార్చి 17 న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించబడుతుంది. 11 రోజుల విరామం తర్వాత మార్చి 29 నుంచి ఈ రెడ్ బాల్ టోర్నీ స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. పురుషుల క్రికెట్ లో ఎప్పటినుచో రంజీ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే.